ఈ కేవైసీ చేయించుకోవాలి
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
ఈ కేవైసీ చేయించుకోవాలి
జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి
Ntoday News Medchal : రేషన్ కార్డు లబ్దిదారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 22,62,797 మంది రేషన్ కార్డు సభ్యులు ఉండగా ఇప్పటివరకు 17,55,183 మంది ఈ కేవైసీ పూర్తి చేశారని అన్నారు. ఇంకా 5.07.614 మంది చేయవలసి ఉందని తెలిపారు. ఈ విషయమై గతంలో కూడా పలుమార్లు రేషన్ కార్డు లబ్దిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ నెల 30లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు.