BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎల్పీజీ వినియోగదారులకు కీలక సమాచారం.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
71 వీక్షణలు

ఆగస్టు 23లోగా పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీల సూచన

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక సమాచారం అందించాయి. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఆగస్టు 16తో ముగిసిన గడువును తాజాగా ఆగస్టు 23 వరకు పొడిగించారు.

లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు.

మరోవైపు సర్వర్ సమస్యల వల్ల ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ పూర్తి కావడం లేదని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు.