BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 02 October 2026, 12:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బిర్యానీ వ్యాఖ్యలపై హిమంత బిశ్వశర్మ కౌంటర్

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Oct, 2026 - 12:15 PM
51 వీక్షణలు

నాగావ్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ మధ్య నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో బిర్యానీ వ్యాఖ్యలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తల్లిపాలు తాగేందుకు పుట్టినవారు మనుషులని, బిర్యానీ తినేందుకు పుట్టినవారు జంతువులని హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 6న జరగనున్న నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జురియాలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు హిమంత బిశ్వశర్మ రకీబుల్ హుస్సేన్‌ను పురాణాల్లోని బకాసురుడితో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన హుస్సేన్ వ్యంగ్యంగా దేవుడు తనను బిర్యానీ తినేందుకే భూమిపైకి పంపాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హిమంత బిశ్వశర్మ తాజాగా పై వ్యాఖ్యలు చేశారు.

నాగావ్ ఉప ఎన్నిక నేపథ్యంలో హిమంత బిశ్వశర్మ, రకీబుల్ హుస్సేన్ మధ్య వ్యక్తిగత వ్యాఖ్యలతో కూడిన ప్రచార విమర్శలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.