BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 06:37 pm
Posted by : K MAHESH

పదేళ్ల నిరీక్షణకు తెర.. కొత్తగా పింఛన్ల పంపిణీ ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 06:37 PM
14 వీక్షణలు

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

అయ్యగారిపల్లిలో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత: సర్పంచ్ జక్కుల మాధవి నాగన్న

కురవి, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన మహిళలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమని అయ్యగారిపల్లి సర్పంచ్ జక్కుల మాధవి నాగన్న అన్నారు. బుధవారం గ్రామంలో సీనియర్ నాయకుడు జనార్ధన్ రెడ్డితో కలిసి నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత పదేళ్లుగా వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు పింఛన్ల కోసం ఎదురుచూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని, ఇప్పుడు కొత్త పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని అన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ హెల్త్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వీరన్న నాయక్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారికి ప్రభుత్వ పథకాలు అందేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌కు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిన్నే జ్యోతి ప్రవీణ్, వార్డు సభ్యులు బుడిగ రమేష్, అనిల్ కుమార్, బుడగ మధు, గంట హరీష్, వడ్లకొండ రమణ రాములు, బుర్ర బిక్షపతి, మధ్యనాల కొమురెల్లి, పొన్నెబోయిన వీరన్న, తాడబోయిన లింగబాబు, జిన్నే చింటూ, బుడిగ రవీందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.