BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రమాడులో సైబర్ చైతన్య రథంతో అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 03:46 PM
17 వీక్షణలు

తిరువూరు: ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, రూరల్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ, మైలవరం ఏసీపీ పి.రామచంద్రరావు మార్గదర్శకత్వంలో, తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం ఎర్రమాడు గ్రామంలో సైబర్ చైతన్య రథంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు ఎస్‌ఐ శాతకర్ణి పాల్గొని సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జాబ్ ఫ్రాడ్, కొరియర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డు మోసాలు, ఓటీపీ మోసాలు, సామాజిక మాధ్యమ ఖాతాల హ్యాకింగ్, నకిలీ లింకులు, రుణ యాప్ మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్ మోసాలపై సవివరంగా వివరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాంకు వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని తెలిపారు.

సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.