BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలకు సర్పంచ్ దంపతుల ఎంపిక thumb ● బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సులో ఇక్కత్ ఎగ్జిబిషన్‌కు తడక వైష్ణవి ఎంపిక thumb ● వరదయ్యపాలెం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా తడ శ్రీనివాసులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఈ నెల 28న ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
మంచి మాట
Date of Publish : 27 October 2026, 03:54 pm
Posted by : PAGADALA DEVAIAH

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపే లక్ష్యంగా ఈటల రాజేందర్‌ పాదయాత్ర

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
27 Oct, 2026 - 03:54 PM
22 వీక్షణలు
  • పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకుడు బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి

ఎల్బీనగర్‌, అక్టోబర్ 27 | ఎన్ టుడే న్యూస్‌:

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు కారణంగా కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలకు న్యాయం చేయడం, సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించడం లక్ష్యంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో గడ్డిఅన్నారం డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌, బీజేపీ నాయకుడు బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు ప్రభావంతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, డంపింగ్‌ యార్డు తరలింపు, కాలుష్య నియంత్రణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, బాధిత ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఈటల రాజేందర్‌ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్న బద్దం ప్రేమ్‌ మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ, జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.