BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 18 September 2026, 10:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 10:45 AM
55 వీక్షణలు

తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక సమాచారం వెలువడింది. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఖరారు చేసింది. ఎస్‌ఐ స్థాయి పోస్టులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు డిసెంబర్‌ 20న ప్రాథమిక రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

7,437 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ హోంశాఖ పరిధిలోని పోలీసు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూలై 29న నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో సుమారు 4,800 కానిస్టేబుల్‌ పోస్టులు, 200 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.

ఎస్‌పీఎఫ్‌లో 44 ఎస్‌ఐ, 1,380 కానిస్టేబుల్‌ పోస్టులు, అగ్నిమాపక శాఖలో 39 ఎస్‌ఐ, 751 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. జైళ్ల శాఖలో 15 ఎస్‌ఐ, 208 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

5.77 లక్షల దరఖాస్తులు

ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19న ప్రారంభమై సెప్టెంబర్‌ 16న ముగిసింది. మొత్తం 4.29 లక్షల మంది అభ్యర్థుల నుంచి 5.77 లక్షల దరఖాస్తులు అందినట్లు నియామక మండలి వెల్లడించింది. ఒక్కో అభ్యర్థి సగటున 1.34 దరఖాస్తులు చేసినట్లు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

మొత్తం దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు దరఖాస్తు చేసుకోగా, 28.88 శాతం మంది రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

అభ్యర్థులకు ఉపశమనం

పోలీసు ఉద్యోగాల పరీక్షల నిర్వహణపై కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తాజాగా తెరపడింది. పరీక్షల తేదీలు ఖరారు కావడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత పకడ్బందీగా కొనసాగించే అవకాశం ఏర్పడింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష తేదీని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా సిద్ధమవుతున్నారు.