BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 04:31 pm
Posted by : K MAHESH

3.48 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 04:31 PM
14 వీక్షణలు

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున అందజేత: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.48 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నట్లు తెలిపింది.

పేద కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో కిలో బియ్యాన్ని రూ.2కు పంపిణీ చేసే విధానం ఉండగా, ప్రస్తుతం ఉచితంగా సన్నబియ్యం అందించడం ద్వారా కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని వివరించింది.

మరోవైపు సన్నవడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వెల్లడించింది.

రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.