మార్కాపురం పోలీసు వ్యవస్థకు మరింత బలోపేతం
మార్కాపురం పోలీసు వ్యవస్థకు మరింత బలోపేతం.. ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా బాధ్యతలు
మార్కాపురం, Ntoday News: మార్కాపురం జిల్లా ఏర్పడిన తొమ్మిది నెలల అనంతరం ప్రత్యేక ఎస్పీ నియామకంతో జిల్లా పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. పోలవరం ఓఎస్డీగా పనిచేసిన పంకజ్ కుమార్ మీనా మార్కాపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధి నుంచి సుమారు 400 నుంచి 450 మంది పోలీసు సిబ్బందిని మార్కాపురం జిల్లాకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా పోలీసు వ్యవస్థలో స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్‌బీ, మహిళా పోలీస్ విభాగం, ఇంటెలిజెన్స్, క్రైమ్ కంట్రోల్ సిస్టమ్ (సీసీఎస్), ఐటీ కోర్, ట్రాఫిక్ తదితర విభాగాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
కొత్త జిల్లాలో పోలీసు విభాగాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.