BREAKING
ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం ఉరుమడ్ల చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
Date of Publish : 10 September 2026, 10:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంగారంలో చదువుకోమని తండ్రి మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 10:49 AM
38 వీక్షణలు

సత్తుపల్లి: చదువుపై దృష్టి పెట్టాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన చరణ్ రెడ్డి ఖమ్మంలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు చదువుపై దృష్టి పెట్టకుండా తిరుగుతుండటంతో తండ్రి బుద్ధిగా చదువుకోవాలని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన చరణ్ రెడ్డి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.