BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 19 July 2026, 05:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోగిరెడ్డి కృష్ణారెడ్డికి అమెరికా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 05:25 PM
146 వీక్షణలు

గోగిరెడ్డి కృష్ణారెడ్డికి అమెరికా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్

తిరువూరు: ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త, లయన్స్ క్లబ్ సభ్యుడు గోగిరెడ్డి కృష్ణారెడ్డికి అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సమాజ సేవ, న్యాయ సేవల రంగాల్లో విశేష సేవలను గుర్తిస్తూ విశ్వవిద్యాలయం ఈ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది.

ఢిల్లీలోని లోధీ రోడ్ ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో ఆదివారం (జూలై 19) నిర్వహించిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సోఫియా నుబాని, చాన్సలర్ డా. జాన్ ఎన్. కలరస్ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా గోగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి గౌరవించిన విశ్వవిద్యాలయ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు, గంపలగూడెం లయన్స్ క్లబ్‌ల ద్వారా తనకు విశేష గుర్తింపు లభించిందన్నారు. నిస్వార్థంగా చేసే మానవ సేవే నిజమైన గుర్తింపును తెస్తుందని పేర్కొన్నారు.

లయన్స్ క్లబ్‌లో తన ప్రయాణానికి అండగా నిలిచిన సభ్యులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవ డాక్టరేట్ తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజానికి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.

కృష్ణారెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తిరువూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.