BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 08:25 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే శబరిమల ప్రసాదం!

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 08:25 PM
33 వీక్షణలు

అరవణ పాయసం, అప్పం ఇంటి వద్దకే డెలివరీ.. నవంబర్ 17 నుంచి ప్రత్యేక బుకింగ్ కౌంటర్ అందుబాటులోకి

అయ్యప్ప భక్తులకు శబరిమల దేవస్థానం నుంచి శుభవార్త అందింది. 2026 మండల-మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకుని శబరిమల సన్నిధానంలో ఇండియా పోస్ట్ ప్రత్యేకంగా 24 గంటల ప్రసాదం బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యం నవంబర్ 17 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.

ఈ ప్రత్యేక కౌంటర్ ద్వారా భక్తులు శబరిమల ప్రసాదమైన అరవణ పాయసం, అప్పంను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న భక్తులకు ప్రసాదాన్ని వారి ఇంటి చిరునామాకే పోస్టల్ శాఖ ద్వారా పంపించనున్నారు. దీంతో శబరిమలకు ప్రత్యక్షంగా వెళ్లలేని భక్తులు సైతం స్వామివారి ప్రసాదాన్ని ఇంటి వద్దనే పొందే అవకాశం కలగనుంది.

మండల-మకరవిళక్కు సీజన్‌లో శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, ప్రసాదాన్ని సులభంగా అందించేందుకు ఇండియా పోస్ట్ ఈ ప్రత్యేక ఏర్పాటును చేపట్టింది. 24 గంటల పాటు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండటం భక్తులకు మరింత సౌలభ్యాన్ని కల్పించనుంది.