BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 02:14 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రైల్వే ప్రయాణికులకు కీలక మార్పు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 02:14 PM
17 వీక్షణలు

 దశాబ్దాల నాటి RAC విధానాన్ని రద్దు చేసే యోచనలో రైల్వే శాఖ

పూర్తి టికెట్ ధర చెల్లించినా ఒకే బెర్త్‌ను ఇద్దరితో పంచుకోవాల్సి వస్తోందని పార్లమెంటరీ ప్యానెల్ అభ్యంతరం

దశాబ్దాలుగా అమల్లో ఉన్న రైల్వే రిజర్వేషన్ విధానాల్లో ఒకటైన ఆర్‌ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సలేషన్) పద్ధతిని రద్దు చేసే దిశగా ఇండియన్ రైల్వేస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నలు లేవనెత్తడంతో రైల్వే శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆర్‌ఏసీ టికెట్ పొందిన ఇద్దరు ప్రయాణికులకు ఒకే బెర్త్‌ను కేటాయిస్తున్నారు. దీంతో ఇద్దరూ ఒకే బెర్త్‌ను పంచుకుంటూ ప్రయాణించాల్సి వస్తోంది. అయితే టికెట్ కోసం పూర్తి ధర చెల్లించినప్పటికీ, వ్యక్తిగతంగా పూర్తి బెర్త్‌ అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశాన్ని ప్రస్తావించిన పార్లమెంటరీ ప్యానెల్.. పూర్తి టికెట్ ధర చెల్లించిన ప్రయాణికులు ఒకే బెర్త్‌ను ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని రైల్వే శాఖను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రయాణికుల సౌకర్యాలు, రిజర్వేషన్ విధానంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఏసీ పద్ధతిపై పునఃపరిశీలన అవసరమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్‌ఏసీ విధానాన్ని కొనసాగించాలా? లేక రద్దు చేయాలా? అనే అంశంపై రైల్వే శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విధానం రద్దుపై అధికారిక నిర్ణయం వెలువడినట్లు ఇప్పటివరకు స్పష్టత లేదు.