కనిగిరిలో రేపు గుర్రం జాషువా జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి, Ntoday News, సెప్టెంబర్ 27: మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా కనిగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ 28, సోమవారం ఉదయం 9 గంటలకు కనిగిరి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా చిత్రపటానికి నివాళులర్పించనున్నట్లు తెలిపింది.
వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సూచనల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కార్యక్రమానికి హాజరై జాషువాకు నివాళులర్పించాలని కోరింది.