BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 25 May 2025, 07:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్

తెలంగాణ
25 May, 2025 - 07:50 AM
186 వీక్షణలు
దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్, అప్రమత్తంగా ఉండాలంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యశాఖ NTODAY NEWS :హైదరాబాద్ ,మే 25 మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ 19 మళ్లీ పంజా విసురుతోంది. ఆసియా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. హాంకాంగ్,సింగపూర్, థాయ్‌లాండ్‌ లలో కొవిడ్ -19 వ్యాప్తి పెరిగింది. వారం వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు నమోదు అవుతున్నప్పటికీ తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జేఎన్‌ 1వేరియంట్, దాని ఉప రకాలతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు JN.1 వేరియంట్, దాని సంబంధిత ఉప-రకాలు కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA.2.86 కుటుంబానికి చెందినదని అంటున్నారు. ఆసియా దేశాల్లోనే... జేఎన్‌.1 వేరియంట్‌, దాని ఉపరకాలు ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కారణంగా కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. జేఎన్‌.1 రకం వేరియంట్‌ పెరగడాన్ని బట్టి.. ఇంతకు మునుపు తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో ఈనెల 11-17 మధ్య కాలంలో 33 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బ్యాంకాక్‌లోనే 6 వేల కేసులున్నాయి.హాంకాంగ్‌లోనూ కొవిడ్‌ కేసులు గత నెల 6-12 తేదీల(6.21)తో పోలిస్తే..13.66శాతానికి చేరుకుంది. చైనాలో పాజిటివిటీ రేటు 3.3 నుంచి 6.3శాతా నికి పెరిగింది. భారత్ లోనూ కేసుల నమోదు దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్ లో 250కు పైగా కొవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం వ్యవధిలోనే 164 కొత్త కేసులు నమోదయ్యాయి, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లోకి కరోనా వైరస్ వేరియంట్లు వెలుగు చూసిన ప్రతీసారి దాని మూలాలు కేరళలోనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిన వేళ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఒక్క మే నెలలోనే దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. Follow us on Website Facebook Instagram YouTube