తమిళనాడులో హిందీ సూచిక బోర్డులు.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్
జాతీయం
జాతీయం
తమిళనాడు: తూత్తుకుడి జిల్లాలోని SH-93పై తమిళం, ఇంగ్లిష్‌తో పాటు హిందీలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా హిందీ భాషలో సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయా బోర్డులపై ఉన్న హిందీ పదాలను తొలగించినట్లు సమాచారం.
ప్రభుత్వం అమలు చేస్తున్న ద్విభాషా విధానాన్ని అధికారులు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.