BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 30 September 2026, 02:19 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
30 Sep, 2026 - 02:19 PM
51 వీక్షణలు

అరేబియా సముద్రం: భారత తీర రక్షక దళం (Indian Coast Guard), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ ఇరానియన్ పడవ నుంచి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

సెప్టెంబర్ 25న లక్షద్వీప్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇరానియన్ ధౌను సముద్ర, వైమానిక నిఘా ద్వారా గుర్తించిన అధికారులు వెంటాడి అడ్డుకున్నారు. అనంతరం పడవలో తనిఖీలు నిర్వహించగా సుమారు 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ లభించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. పట్టుబడిన పడవ, సిబ్బంది, మాదక ద్రవ్యాలను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల కోసం ముంబైకి తరలించినట్లు తెలిపింది.

డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్, సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలించాల్సి ఉంది అనే అంశాలపై గుజరాత్ ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగించనున్నాయి.

సముద్ర మార్గంలో జరుగుతున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.