BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 20 September 2026, 08:24 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఖర్చెంతైనా బాధ్యత నాదే.. ఉద్యమ నాయకురాలు రహీమున్నీసా బేగంకు నాయిని భరోసా

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
20 Sep, 2026 - 08:24 AM
17 వీక్షణలు

ఉద్యమకారిణి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

హనుమకొండ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యమకారిణి రహీమున్నీసా బేగంను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరామర్శించారు. హనుమకొండలోని ఏకశిలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతున్న రహీమున్నీసా బేగంకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను నాయిని రాజేందర్ రెడ్డి కోరినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “చికిత్సకు ఖర్చెంతైనా పర్వాలేదు.. మెరుగైన వైద్యం అందించడం మన బాధ్యత. రహీమున్నీసా బేగం ఆరోగ్యం కోసం అవసరమైన సహాయం అందిస్తాను” అని భరోసా ఇచ్చారు.

ప్రజలు, సమాజం కోసం ఉద్యమ సమయంలో ముందుండి పనిచేసిన రహీమున్నీసా బేగంకు అనారోగ్య సమయంలో అండగా ఉంటానని ఆయన తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు.

రహీమున్నీసా బేగం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నాయిని రాజేందర్ రెడ్డి ఆకాంక్షించారు.