BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 03:51 pm
Posted by : K MAHESH

మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం తప్పదు

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 03:51 PM
67 వీక్షణలు

చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక

మునుగోడు: నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించకపోతే మరో కురుక్షేత్ర పోరాటం తప్పదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల సొమ్మును కాపాడే వ్యక్తినే తప్ప, దానిని దుర్వినియోగం చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో నూతనంగా ఎంపికైన చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు, గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి, చండూరు మండలాలతో పాటు చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఎంపికైన మొత్తం 3,630 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వీరిలో మునుగోడు మండలంలోని 28 గ్రామాలకు చెందిన 845 మంది, చండూరు మండలంలోని 19 గ్రామాలకు చెందిన 530 మంది, చండూరు మున్సిపాలిటీలోని 10 వార్డులకు చెందిన 293 మంది, మర్రిగూడ మండలంలోని 18 గ్రామాలకు చెందిన 785 మంది, నాంపల్లి మండలంలోని 32 గ్రామాలకు చెందిన 651 మంది ఉన్నారు. లబ్ధిదారుల్లో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మందికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పింఛన్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్ము పేదలకు, అర్హులైన రైతులకు చేరాలే తప్ప అనర్హులకు వెళ్లకూడదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రూ.4 వేల పింఛన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ హామీని ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు వివరించాలని కోరారు. పింఛన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచినా తప్పులేదని అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని పేర్కొన్న ఎమ్మెల్యే.. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అప్పులు చేసి, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఆ అప్పుల భారం కారణంగా ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

మునుగోడులో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించినప్పటికీ, ఆరు నెలల పాటు పనులు చేసిన తర్వాత నిధులు విడుదల కాక కాంట్రాక్టర్లు పనులు వదిలి వెళ్లిపోతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొడంగల్, మధిర నియోజకవర్గాలకే తెలంగాణ రాష్ట్రం పరిమితం కాదని, ఇతర నియోజకవర్గాలకు కూడా సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు లేదా రూ.20 వేల కోట్లు కేటాయించినా తమకు అభ్యంతరం లేదని, మునుగోడు అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని అన్నారు. నిధులు అడిగినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు వివక్ష చూపకూడదని విజ్ఞప్తి చేశారు.

తాను కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి విధేయుడినేనని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిధులు అడగడం తన బాధ్యత అని పేర్కొన్నారు. పదవుల కోసం తాను పాకులాడటం లేదని, ప్రజల మంచి కోసమే మాట్లాడుతున్నానని అన్నారు. మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా పాలన సాగించాలని కోరుతూ, నిధులు నిలిపివేస్తే మరో కురుక్షేత్ర పోరాటం తప్పదని హెచ్చరించారు.