BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

ఏడాదిన్నరలోనే ‘సూపర్ సిక్స్’ సూపర్ సక్సెస్

తెలంగాణ
30 Dec, 2025 - 11:03 AM
268 వీక్షణలు

అవరోధాలను అవకాశాలుగా మలచడం సీఎం చంద్రబాబుకే సాధ్యం

NTODAY NEWS: విజయవాడ ఏడాదిన్నరలోనే ‘సూపర్ సిక్స్’ సూపర్ సక్సెస్ ఎన్డీయే కూటమి ఏడాదిన్నర పాలనపై మీడియా సమావేశం విజయవాడ: అవరోధాల నుంచి అవకాశాలను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సీఎం చంద్రబాబు నాయుడు ముందుంటారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనూరాధ అన్నారు. ఎన్డీయే కూటమి ఏడాదిన్నర పాలనలో సాధించిన విజయాలపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనూరాధ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం–ఎన్టీఆర్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ షిబ్లీ, రాష్ట్ర ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్, రాష్ట్ర బిల్డింగ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘు రామరాజు, రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాల కోటయ్య పాల్గొన్నారు. సమావేశానికి ముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన గద్దె అనూరాధకు, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన చెన్నుబోయిన చిట్టిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఏడాదిన్నర పూర్తయ్యేలోపు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేసిందన్నారు. ప్రజల నుంచి ‘మంచి ప్రభుత్వం–ప్రజా ప్రభుత్వం’ అనే ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు చెల్లించామని చెప్పారు. ‘స్త్రీ శక్తి’ పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చిందని, ఇప్పటివరకు రూ.1,444 కోట్ల వ్యయంతో 3.25 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని వివరించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఎక్కడైనా పెన్షన్ పొందే సౌకర్యం కల్పించామని తెలిపారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇమామ్‌లు–మౌజమ్స్–పాస్టర్లు, డ్రైవర్లకు రూ.15 వేల సహాయం, గీతకార్మికులకు మద్దతు వంటి అనేక కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తొలి సంతకంతో ప్రారంభమైన మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీ పూర్తయిందని, 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు కూడా ముగిశాయని తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా ముందడుగు పడిందన్నారు. జనగణన పూర్తయ్యాక గ్రేటర్ విజయవాడపై సీఎం నిర్ణయం తీసుకుంటారని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలో ఉందని స్పష్టం చేశారు. గద్దె అనూరాధ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం వైపు నెట్టితే, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వికాస మార్గంలో ముందుకెళ్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్నక్యాంటీన్లను, ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నక్యాంటీన్ ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు చేసి నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని, రాబోయే సంక్రాంతి రైతులకు నిజమైన పండుగ అవుతుందన్నారు. టీడీపీ మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడులు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందని, గంజాయి–డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనాథ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube