BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:13 pm
Posted by : PAGADALA DEVAIAH

రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన పార్కు ప్రారంభం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
16 Nov, 2026 - 05:13 PM
1 వీక్షణలు

ప్రారంభించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్‌-1, విశ్వేశ్వరయ్య కాలనీల ప్రజల సౌకర్యార్థం దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన సుందరమైన పార్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు పదేళ్ల క్రితమే ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ, కొందరు వ్యక్తులు ఈ స్థలంలో పార్కు నిర్మించకూడదంటూ కోర్టును ఆశ్రయించడంతో పనులు కొంతకాలం నిలిచిపోయాయని తెలిపారు.

అయినప్పటికీ, స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఈ స్థలంలో పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగినట్లు చెప్పారు. చివరకు న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, అత్యంత సుందరంగా పార్కును నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను కొంతకాలం మాత్రమే అడ్డుకోగలరని, చివరకు న్యాయమే గెలుస్తుందని సుధీర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, డివిజన్ అధ్యక్షుడు సత్యం చారి, నాగిరెడ్డి కాలనీకి చెందిన భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి, కరుణాకర్, ప్రతాప్, ప్రసాద్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అమర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.