భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
జాతీయం
జాతీయం
కేరళ, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్, ఎన్‌టుడే న్యూస్: దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. కేరళ, మాహే, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.