BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 07:32 pm
Posted by : KADARI RAMANA

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
18 Nov, 2026 - 07:32 PM
24 వీక్షణలు

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ భావేష్ మిశ్రా

జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, ఇతర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీమా నమోదు శిబిరాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, నామినీ మైనర్ అయితే అపాయింటీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. శిబిరాల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

వీబీ-జీ రామ్‌జీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పనులు కోరుకునే వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున సోక్‌పిట్ల నిర్మాణాలు చేపట్టాలని, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. సంబంధిత ప్రక్రియను వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ప్రచార గోడపత్రికను జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న క్రీడా పోటీలపై జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టాలని, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవరావు, డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవిదాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.