BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 20 August 2026, 03:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇథనాల్ దెబ్బ.. చక్కెరకు షాక్!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:27 PM
68 వీక్షణలు

రూ.40 నుంచి రూ.65కు చేరిన పంచదార ధరలు

దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గతంలో కిలో రూ.40 వరకు ఉన్న చక్కెర ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ.60 నుంచి రూ.65 వరకు చేరింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.

చక్కెర ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఇథనాల్ తయారీ కోసం చెరకు వినియోగం పెరగడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంధన మిశ్రమంలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచేందుకు చెరకు పంటలో కొంత భాగాన్ని అటువైపు మళ్లించడంతో చక్కెర నిల్వలు తగ్గుతున్నాయని అంచనా.

చక్కెర ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. డిమాండ్‌కు సరిపడా నిల్వలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతులపై ఉన్న సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మిల్లుల వద్ద భారీగా పెరిగిన ధరలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చక్కెర మిల్లుల వద్ద 100 కిలోల ధర రూ.5,400 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. ఏడాది క్రితం ఇదే పరిమాణం ధర సుమారు రూ.3,900 ఉండేది. అంటే భారీగా పెరుగుదల నమోదైంది.

రానున్న పండుగల సీజన్‌లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో కేంద్రం నిల్వలపై దృష్టి సారిస్తోంది. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో సరఫరా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇథనాల్ ఉత్పత్తి విధానం, చెరకు వినియోగంలో మార్పులు కొనసాగితే వచ్చే ఏడాది కూడా చక్కెర ధరలపై ఒత్తిడి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.