BREAKING
thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
Date of Publish : 19 August 2026, 09:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జీతాలు పెంచాలంటూ జూనియర్‌ డాక్టర్ల భారీ నిరసన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:33 AM
66 వీక్షణలు

గుంటూరు: స్టయ్‌ఫండ్‌ను 15 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జీజీహెచ్‌ జూనియర్‌ డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రమేష్‌ హాస్పిటల్‌ సిగ్నల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన వైద్యులు తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. “వీ వాంట్‌ జస్టిస్‌” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పెరుగుతున్న పని ఒత్తిడికి అనుగుణంగా స్టయ్‌ఫండ్‌ లేదని, విధి నిర్వహణలో గంటల తరబడి సేవలందిస్తున్నా తమకు అందుతున్న పారితోషికం తక్కువగా ఉందని జూనియర్‌ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఈ నిరసన ర్యాలీలో జీజీహెచ్‌ పరిధిలోని పలువురు జూనియర్‌ డాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు.