BREAKING
thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
Date of Publish : 04 August 2026, 08:34 pm
Posted by : PAMMI NAVEENKUMAR

జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
04 Aug, 2026 - 08:34 PM
96 వీక్షణలు

జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR టౌన్ హాల్ సమావేశం

నారా లోకేష్ రాజీనామా చేయాలి – డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి: చిర్ల జగ్గిరెడ్డి

ఈరోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం CRC ఫంక్షన్ హాల్‌లో విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన AP GEN-Z WAR టౌన్ హాల్ సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యరావు గారు మరియు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులను మోసం చేసినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, విద్యార్థులు మరియు యువత హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, విద్యార్థి మరియు యువజన విభాగ సభ్యులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.