వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్
కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహానికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నెల 24న వైఎస్ అంజిలి రెడ్డి–సోమల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థం జరగనుంది. నవంబర్ 25న వివాహ వేడుక నిర్వహించనున్నట్లు, డిసెంబర్ 5న వివాహ రిసెప్షన్ జరగనున్నట్లు షర్మిల తెలిపారు.
వివాహానికి సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. కుమార్తె వివాహ వేడుకలకు సంబంధించిన ఈ వివరాలను షర్మిల సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు..