BREAKING
thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు
Date of Publish : 18 September 2026, 09:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫార్మసీలపై సీసీటీవీ నిఘా.. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందుల విక్రయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 09:06 PM
9 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం ఫార్మసీల్లో మందుల విక్రయాలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మందుల దుర్వినియోగాన్ని అరికట్టడం, ముఖ్యంగా పిల్లలకు ప్రమాదకరమైన ఔషధాలు అనధికారికంగా విక్రయించకుండా నియంత్రించడం లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ప్రతి ఫార్మసీలో కస్టమర్లు, మందుల విక్రయ ప్రక్రియ స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా నమోదయ్యే దృశ్యాలను కనీసం మూడు నెలలపాటు భద్రపరచాల్సి ఉంటుంది. ఔషధ నియంత్రణ అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీల సమయంలో అవసరమైతే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించనున్నారు.

డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే సంబంధిత మందులను విక్రయిస్తున్నారా లేదా అన్నది అధికారులు పరిశీలించనున్నారు. ముఖ్యంగా పెద్దలకు ఉద్దేశించిన శక్తివంతమైన దగ్గు సిరప్‌లు, కొన్ని యాంటీబయాటిక్స్, నిద్ర మాత్రలు వంటి మందులు పిల్లలకు అనధికారికంగా అందకుండా చర్యలు తీసుకోనున్నారు.

అలాగే మత్తు ప్రభావం కోసం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్న షెడ్యూల్డ్ మందుల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫార్మసీల్లో జరిగే ఔషధ విక్రయాలపై పారదర్శకత పెంచడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించే వారిపై పర్యవేక్షణ, చర్యలను మరింత బలోపేతం చేయడం ఈ నిర్ణయం ఉద్దేశంగా పేర్కొంది.