BREAKING
thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Date of Publish : 18 September 2026, 03:19 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
18 Sep, 2026 - 03:19 PM
0 వీక్షణలు

కదిరి: జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెండిదండి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఆయనకు వివరించారు.

అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను పరిశీలించారు.

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే వెంట కదిరి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్, నాయకులు కుట్టాల లక్ష్మణ, రాజేంద్ర, బసెట్టి శ్రీనివాసులు, తుమ్మల రవీంద్ర, ఇర్ఫాన్, రామ్మోహన్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.