తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ఆందోళన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు, సెప్టెంబర్ 18: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రతతో పాటు తమకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వీఆర్ఏలు తెలిపారు.