BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 01:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను 99వ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 01:33 PM
13 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం జాతీయ పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పించారు.

మునగాకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థమని, ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గర్భిణీల్లో రక్తహీనత సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు. బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లిపాల ఉత్పత్తికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. సీజన్‌కు అనుగుణంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం వండే ముందు, వడ్డించే సమయంలో, భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతిరోజూ సరైన సమయంలో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. బయట లభించే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో వివిధ పోషక పదార్థాలు, ఆకుకూరలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వాటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను మహిళలు, చిన్నారులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కే. లింగమ్మ, పి.వి. సాయి లక్ష్మి, ఎం. స్వరూప రాణి, బి. నాగమణి, డి. దివ్యతో పాటు మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.