మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా – పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలోని మోదుగులపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పామగల మనోజ్ కుమార్‌కు మంత్రి నారా లోకేష్ ప్రశంసా పత్రంతో పాటు బహుమతిని పోస్టు ద్వారా పంపించారు.
ప్రశంసా పత్రంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహా ఉద్యమమని పేర్కొన్నారు. అలాంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనోజ్ కుమార్ వంటి అంకితభావంతో పనిచేసే కార్యకర్తల పాత్ర అభినందనీయమని తెలిపారు.
పార్టీ సిద్ధాంతాల పట్ల మనోజ్ కుమార్ చూపుతున్న నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వాన్ని నారా లోకేష్ ప్రశంసించారు. ముఖ్యంగా ‘MY TDP’ యాప్ ద్వారా వచ్చే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.
మనోజ్ కుమార్ సాధించిన గుర్తింపు కేవలం ఒక బహుమతి మాత్రమే కాదని, పార్టీ కార్యకర్తగా ఆయన చేస్తున్న కృషికి పార్టీ అందిస్తున్న గౌరవానికి ప్రతీక అని నారా లోకేష్ పేర్కొన్నారు.