BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 01:23 pm
Posted by : A. MURALIDHAR

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
18 Sep, 2026 - 01:23 PM
4 వీక్షణలు

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్

అన్నమయ్య జిల్లా – పుంగనూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పుంగనూరు మాల మహానాడు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ మేరకు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పుంగనూరు పట్టణ అధ్యక్షుడు ఏడూరి శ్రీనివాసులు మాల మహానాడు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.

అప్పటి పరిస్థితుల్లో దేశంలోని అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచారని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగం, అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. హమారా ప్రసాద్‌పై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, రియాజ్, పరమేష్, షమీ ఉల్లా, ఏడూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.