చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమం
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉరుమడ్ల రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శుక్రవారం ఐదో రోజు కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు కురిసి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుని ప్రార్థించారు.
శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన ప్రసాద సంతర్పణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు.
దీంతో ఉరుమడ్ల రోడ్డు పరిసర ప్రాంతం భక్తులతో సందడిగా మారింది
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు..