BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 01:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
18 Sep, 2026 - 01:30 PM
0 వీక్షణలు

హైదరాబాద్: మాదాపూర్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద తొలి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలోని 11,56,915 అర్హ గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కూడా సీఎం వివరించారు. వర్షాభావం కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం కోరారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర సహకారం కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం వివరించారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.

అలాగే 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.