మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో సియంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో సియంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు
నూజివీడు: ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం నూజివీడు టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన మల్లెం వల్లిశేషు, శెట్టి అర్షిత్ కుమార్, శెట్టి అరవింద్ కుమార్, చేనుబోయిన సత్యనారాయణ, చీదిరాల సంపత్ కుమార్‌లకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్‌ఓసీల ద్వారా విస్తృతంగా సహాయం అందిస్తోందన్నారు. నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథి ప్రత్యేక చొరవతో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ముందుగా వైద్య ఖర్చులు భరించే స్థోమత లేని పేదలకు ఎల్‌ఓసీల ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ఎంతో ఊరటనిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, మల్లెం శేషగిరిరావుతో పాటు సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.