BREAKING
thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
Date of Publish : 18 September 2026, 07:12 pm
Posted by : ఈడూరి డేవిడ్

పుల్లలపాడులో రెవరెండ్, డాక్టరేట్, బిషప్ ఆర్డినేషన్ ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
18 Sep, 2026 - 07:12 PM
6 వీక్షణలు

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, పుల్లలపాడు:

పుల్లలపాడు గ్రామంలోని గ్రేస్ గాస్పెల్ చర్చ్‌లో బిషప్ జోసెఫ్ పున్నయ్య కొక్కిరిపాటి ఆధ్వర్యంలో గ్రాండ్ రెవరెండ్, డాక్టరేట్, బిషప్ ఆర్డినేషన్ ఉత్సవాలను నిర్వహించారు.

ఆర్చిబిషప్ యోహాను కలపాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రెష్ ఫైర్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఇండియా డైరెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. బిషప్ జోసెఫ్ పున్నయ్య కొక్కిరిపాటి, బిషప్ డేవిడ్ ధర్మారావు డొక్కా తదితరులు నిర్వాహకులుగా, ఆహ్వానితులుగా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆర్చిబిషప్ యజ్జల బాలరాజు, స్టేట్ కన్వీనర్ బిషప్ గంధం జాకబ్ కార్యక్రమంలో వాక్య సందేశం, గ్రీటింగ్స్ అందించారు.

ఈ సందర్భంగా రెవరెండ్, బిషప్, డాక్టరేట్ అభ్యర్థులకు ప్రార్థనలు నిర్వహించి ఆలివ్ నూనెతో అభిషేక కార్యక్రమం చేపట్టారు. అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రేమ విందు ఏర్పాటు చేసి, పూలదండలతో సన్మానించారు.

సుమారు 70 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వారిలో 30 మంది అభ్యర్థులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బిషప్ యజ్జల బాలరాజు ప్రసంగించారు. అనంతరం బిషప్ జోసెఫ్ పున్నయ్య కొక్కిరిపాటి, మేరీ బిషప్ దంపతులను సన్మానించారు.

ఆర్చిబిషప్ యోహాను కలపాలను కూడా సన్మానించడంతో కార్యక్రమంలో పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేస్ గాస్పెల్ చర్చ్ సంఘాలు, EGPF ఇండియా మినిస్ట్రీస్, లవ్ అండ్ కేర్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.