BREAKING
thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
Date of Publish : 18 September 2026, 07:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైభవంగా రేణుక ఎల్లమ్మ, లక్ష్మీ ఉప్పలమ్మ కళ్యాణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 07:12 PM
11 వీక్షణలు

పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఊట్కూర్ రోడ్డులో ఉన్న శివ నాగమల్లేశ్వరి స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహర్షి, లక్ష్మీ ఉప్పలమ్మ–మునిరాజు కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపకులు కొండేటి నారాయణస్వామి, వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును నిర్వహించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కళ్యాణ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి పెనుగొలనుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.