నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా
ఆంధ్రప్రదేశ్
/
శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి:
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం మల్లమీదపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు లక్ష్మీపతి రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు అత్తార్ చాంద్ బాషా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గృహ యజమానులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ (యాక్టివిటీ) వజ్రా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
గాండ్లపెంట మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.