BREAKING
thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
Date of Publish : 18 September 2026, 07:15 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమన్వయంతో పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
18 Sep, 2026 - 07:15 PM
15 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమన్వయంతో పనిచేయాలి: దద్దాల నారాయణ యాదవ్

ప్రకాశం జిల్లా, పీసీపల్లి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం పీసీపల్లి మండల పార్టీ అధ్యక్షుడు గోపవరపు బొర్రారెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి దద్దాల నారాయణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రతి వార్డులో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు.

గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హామీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ కార్యక్రమం ద్వారా గతంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు వివరించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, రాజకీయ భేదాలు లేకుండా అమలు చేశామని దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు. గత పాలనలో పార్టీ శ్రేణులు చేసిన కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించడంలో కొన్ని సందర్భాల్లో వెనుకబడ్డామని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన పలు విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వీటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

డీఎస్సీకి సంబంధించిన అంశాలపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించాలని అన్నారు.

అనంతరం పార్టీ మండల కమిటీ సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఈ ఐడీ కార్డులు గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.