BREAKING
thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు
Date of Publish : 18 September 2026, 09:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

SIR నోటీసులు అందుకున్న ఓటర్లకు ఊరట

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 09:05 PM
8 వీక్షణలు

SIR నోటీసులు అందుకున్న ఓటర్లకు ఊరట కుటుంబ సభ్యులతో ధ్రువపత్రాలు సమర్పించే అవకాశం

కొత్త ఓటర్లకు అక్టోబర్ 1, 2026 అర్హత తేదీ

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో నోటీసులు అందుకున్న ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఇప్పటివరకు నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు సంబంధించిన ధ్రువపత్రాలతో నేరుగా అధికారుల ఎదుట హాజరై వివరాలు సమర్పించాల్సి ఉండేది. తాజాగా ఈ నిబంధనలో సడలింపు కల్పించారు.

నోటీసులు అందుకున్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అధికారుల వద్దకు వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. దీంతో వ్యక్తిగతంగా హాజరు కాలేని ఓటర్లకు ఇబ్బందులు తగ్గనున్నాయి.

అదేవిధంగా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వారికి 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్హత పొందే కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునేందుకు అవకాశం లభించనుంది.