BREAKING
thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు
Date of Publish : 18 September 2026, 09:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రానికి భారీగా ఐటీ, క్వాంటం పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 09:04 PM
8 వీక్షణలు

ఎస్‌ఐపీబీ భేటీలో రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 8,896 ఉద్యోగాలు కల్పించే 10 ప్రాజెక్టులకు ఆమోదం

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఐటీ, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమమవుతోందని ప్రభుత్వం తెలిపింది. సమావేశంలో భారీ పెట్టుబడులతో చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా విశాఖపట్నం, అమరావతి, కడప ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.

విశాఖలో ఐటీ, ఏఐ కేంద్రాలు

ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ విశాఖపట్నంలో రూ.100 కోట్ల పెట్టుబడితో ‘ఇంటిగ్రేటెడ్ హబ్ ఏఐ అండ్ టెక్ ట్రైనింగ్ సెంటర్’ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

అదేవిధంగా విశాఖలో డెలాయిట్ సంస్థ రూ.43.75 కోట్ల పెట్టుబడితో 2,500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.

కడపలో ఎలక్ట్రానిక్స్ యూనిట్

ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కడప జిల్లాలో రూ.70 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు సంబంధించి ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021–24 కింద అర్హత కలిగిన ప్రోత్సాహకాల దరఖాస్తు గడువు పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ యూనిట్ ద్వారా సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

క్వాంటం రంగానికి అమరావతి కేంద్రంగా

అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. సృష్టి క్వాంటం ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్, నానోఫ్యాబ్రికేషన్ పరిశోధన, తయారీ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,000 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు.

క్వాంటం కోడాన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.167 కోట్ల పెట్టుబడితో క్వాంటం ఏఐ ఆధారిత బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. డ్రగ్ డిస్కవరీ పరిశోధనకు సంబంధించిన ఈ ప్రాజెక్టు ద్వారా 126 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

అరోహాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.62 కోట్ల పెట్టుబడితో ఫోటోనిక్స్ క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

ట్రైక్వాంటా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్ల పెట్టుబడితో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌తో పాటు హైబ్రిడ్ క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 175 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.9 కోట్ల పెట్టుబడితో ‘ఫోటాన్‌క్యూ’ రూమ్-టెంపరేచర్ ఫోటోనిక్ క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 45 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

వెరిడేటా హెల్త్ ఇంక్. రూ.4.5 కోట్ల పెట్టుబడితో క్వాంటం ఆధారిత క్లినికల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన గ్లోబల్ ఇంజినీరింగ్ హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 50 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఈ ప్రాజెక్టుల ద్వారా ఐటీ, ఏఐ, ఎలక్ట్రానిక్స్, క్వాంటం కంప్యూటింగ్, ఫోటోనిక్స్, బయోటెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు రాష్ట్ర యువతకు నైపుణ్య ఆధారిత ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది.