BREAKING
thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb వైఎస్సార్‌సీపీలో చేరిన వీరభద్ర కాలనీ యువకులు thumb గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష thumb వైఎస్ అంజిలి రెడ్డి వివాహంపై షర్మిల కీలక ప్రకటన thumb అక్టోబర్ 1 నుంచి జనన, మరణ నమోదు కొత్త నిబంధనలు thumb చిట్యాలలో గణనాథునికి ప్రత్యేక పూజలు thumb నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా thumb ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి
Date of Publish : 18 September 2026, 11:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డెంగీ వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి.. 2027లో అందుబాటులోకి

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Sep, 2026 - 11:00 PM
9 వీక్షణలు

డెంగీ వైరస్‌పై పోరాటంలో భారత్ కీలక ముందడుగు వేసింది. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన ‘QDENGA’ డెంగీ వ్యాక్సిన్‌కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) మార్కెటింగ్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ టీకా 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో QDENGA సరఫరా కోసం తకేడా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో డెంగీ సోకిందా లేదా అనే స్క్రీనింగ్ లేకుండానే టీకా తీసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

దేశంలో డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం డెంగీ నివారణలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే టీకా ధర, ప్రభుత్వ టీకా కార్యక్రమాల్లో చేర్చే అంశం, ఎవరికి ఇవ్వాలనే మార్గదర్శకాలు వంటి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.