BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 05:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన మ్యాగజైన్..

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Sep, 2026 - 05:41 PM
1 వీక్షణలు

132 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన మ్యాగజైన్.. రూ.1.08 కోట్ల జరిమానా తప్పింది!

1894 నాటి మ్యాగజైన్‌ను తిరిగి ఇచ్చిన 84 ఏళ్ల వ్యక్తి.. అసలు అది తన వద్దకు ఎలా వచ్చిందో తెలియదట

అమెరికా | Ntoday News

అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 1894 సెప్టెంబర్‌లో లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ‘ది సెంచరీ ఇలస్ట్రేటెడ్ మంత్లీ మ్యాగజైన్’ ఏకంగా 132 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఘటనతో లైబ్రరీ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. 

84 ఏళ్ల బారింగ్టన్‌ నివాసి జాన్ హాన్సన్ ఈ మ్యాగజైన్‌ను ఇటీవల కాంకర్డ్ పబ్లిక్ లైబ్రరీకి తిరిగి అందించారు. లైబ్రరీ రికార్డుల ప్రకారం మ్యాగజైన్ 48,220 రోజులుగా తిరిగి ఇవ్వలేదు. అప్పటి జరిమానా లెక్కల ప్రకారం ఆయనపై సుమారు 12,055 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.10 లక్షలకు పైగా) ఫైన్ పడే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం లైబ్రరీలో ‘ఫైన్ ఫ్రీజ్’ అమల్లో ఉండటంతో ఎలాంటి జరిమానా విధించలేదు. 

హాన్సన్‌ 1966లో బాస్కోవెన్‌ నుంచి బారింగ్టన్‌కు మారుతున్న సమయంలో ఈ మ్యాగజైన్ తన వద్ద ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అయితే అది తన వద్దకు ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలియదని చెప్పారు. దశాబ్దాలుగా అది తమ ఇంట్లోనే ఉందని పేర్కొన్నారు. 

మ్యాగజైన్‌పై కాంకర్డ్ పబ్లిక్ లైబ్రరీ గుర్తులు, ఒక వారం మాత్రమే ఉంచుకోవచ్చనే సూచన కూడా ఉన్నాయి. లైబ్రరీ సిబ్బంది పరిశీలనలో ఇది నిజంగానే 1894లో తీసుకెళ్లిన అసలు కాపీ అని నిర్ధారించారు. మ్యాగజైన్‌లో కవితలు, వ్యాసాలు, వార్తలతో పాటు అప్పటి ప్రకటనలు కూడా ఉన్నాయి. 

లైబ్రరీ ఈ చారిత్రక మ్యాగజైన్‌ను ఇకపై సాధారణంగా పాఠకులకు ఇవ్వకుండా, కాంకర్డ్‌ రూమ్‌లో ప్రదర్శనకు ఉంచాలని భావిస్తోంది.