తెలంగాణలో SA-1 పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ
/
హన్మకొండ
అక్టోబర్ 1 నుంచి 9 వరకు పరీక్షలు.. 10 నుంచి 22 వరకు దసరా సెలవులు
తెలంగాణ | Ntoday News
తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు SA-1 పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తరగతుల వారీగా పరీక్షల సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
- 1 నుంచి 5వ తరగతి: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
- 6, 8వ తరగతి: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
- 7వ తరగతి: మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
- 9వ తరగతి: మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు
- 10వ తరగతి: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు
SA-1 పరీక్షలు ముగిసిన అనంతరం అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.