BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 08:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబోజి పెద్ద సీతయ్య గెలుపే లక్ష్యంగా టీడీపీ ప్రచారం ఆరుగొలనుపేట–జనార్ధనవరం ఎంపీటీసీ అభ్యర్థికి మద్దతుగా అట్లూరి రమేష్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Oct, 2026 - 08:05 PM
28 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట–జనార్ధనవరం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబోజి పెద్ద సీతయ్యకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత అట్లూరి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి అంబోజి పెద్ద సీతయ్యను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా అట్లూరి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీ ఎన్నికల్లో అంబోజి పెద్ద సీతయ్యకు మద్దతుగా నిలిచి, ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కోరారు. గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థికి ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాదాసు చిన్న పుల్లయ్య,పలగాని దుర్గా రావు, వంగల సుబ్బారావు, ఇజ్జిగాని మురళి, ఇజ్జిగాని రామారావు, అబ్రాహాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు