చాట్స్‌వర్త్‌లో ఘోర ప్రమాదం.. రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కుప్పకూలిన హెలికాప్టర్
అంతర్జాతీయం
అంతర్జాతీయం
లాస్ ఏంజిల్స్ / Noday News: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ చాట్స్‌వర్త్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నార్డ్‌హాఫ్ స్ట్రీట్‌లో LA మెట్రో బస్సును ఓ SUV ఢీకొట్టిన ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన NBC లాస్ ఏంజిల్స్ న్యూస్ ఛానెల్‌కు చెందిన హెలికాప్టర్ గాల్లోనే అదుపుతప్పి కుప్పకూలినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనను కవర్ చేస్తున్న సమయంలో న్యూస్ హెలికాప్టర్ కూడా కుప్పకూలి రోడ్డుపై పడటంతో అక్కడ మరింత కలకలం నెలకొంది.
హెలికాప్టర్ ప్రమాదంలో ఒకరిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఘటనపై స్థానిక అత్యవసర సేవల సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.