BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 05:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

22A భూములపై కొత్త విధానం..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
16 Sep, 2026 - 05:38 PM
0 వీక్షణలు

22A భూములపై కొత్త విధానం.. 15 రోజులు అభ్యంతరాలకు అవకాశం: సీఎం రేవంత్

భూములను నిషేధిత జాబితాలో చేర్చే ముందు ఈ-కేవైసీ, ఈమెయిల్, పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణలో 22A నిషేధిత భూముల అంశంపై ప్రభుత్వం నిర్దేశిత విధానంతో ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 22A జాబితాలో ఏ భూములను చేర్చాలనే విషయంలో స్పష్టమైన ప్రక్రియను అనుసరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం 22A భూముల అంశంపై రాష్ట్రంలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం ఈ వివరాలను వెల్లడించారు. 

22Aలో ఏదైనా భూమిని చేర్చే అధికారం ఆర్డీవో లేదా సబ్‌ కలెక్టర్లకు ఉంటుందని సీఎం తెలిపారు. సంబంధిత అధికారులు భూ సర్వే నంబర్, పట్టాదారు వివరాలను గుర్తించిన తర్వాతే తదుపరి ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు.

భూమిని నిషేధిత జాబితాలో చేర్చే ముందు ఈ-కేవైసీతో పాటు ఈమెయిల్, పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం అందించే విధానం పాటిస్తామని తెలిపారు. సంబంధిత భూయజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు 15 రోజుల సమయం ఇస్తామని సీఎం వెల్లడించారు.

అదేవిధంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల విషయంలోనూ కొత్త విధానం తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు. 22A జాబితాలో పొరపాటుగా చేర్చిన ప్రైవేట్ భూములను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే సీఎం, రెవెన్యూ మంత్రి వెల్లడించారు. 

22A నిషేధిత జాబితా కారణంగా భూముల రిజిస్ట్రేషన్లు, రుణాలు, ఇతర లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పలువురు భూయజమానులు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోనున్న కొత్త విధానంపై ఆసక్తి నెలకొంది.