BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 07 July 2026, 03:14 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జి.ఓ. ఎంఎస్. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Jul, 2026 - 03:14 PM
104 వీక్షణలు

అన్నమయ్య జిల్లా.. పుంగనూరు 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దస్తావేజుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.పుంగనూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ...ఈ నిర్ణయం అమలులోకి వస్తే దస్తావేజుల రచయితల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు, ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న దస్తావేజుల రచయితల హక్కులను పరిరక్షించాలని కోరారు.

జి.ఓ. ఎంఎస్. నెం. 396ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజుల రచయితల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.