BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 07 July 2026, 02:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్.. రాజకీయ దుమారం..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 02:27 PM
137 వీక్షణలు

తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కేవీఆర్‌ను సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులు తీసుకెళ్తుండగా, తన భర్తను కాపాడుకునేందుకు అడ్డుకున్న ఆయన భార్య విజయలక్ష్మిపై ఏపీ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బొబ్బిలి సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు, తదుపరి విచారణ కోసం ఆ కేసును హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

అయితే, సివిల్ డ్రెస్సులో వచ్చిన వ్యక్తులు తన భర్తను ఎత్తుకుపోతుండగా అడ్డుకున్న మహిళపైనే కేసు నమోదు చేయడంపై పలు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చ సాగుతోంది.